దశాబ్దాల నుంచి ఎడారిలా కొల్లేరు

కొల్లేరు – ఆసియాఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. కాని దశాబ్దాల కాలంగా ఈ సరస్సులో నీటితో నిండిన పాపాన పోలేదు… పేరుకు వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నా… అక్రమార్కుల కబంధహాస్తలకు చిక్కిశల్యమైపోయింది… ఆ మంచినీటి సరస్సు ప్రస్తుతం చేపల చెరువుల సమూహాంలా మారిపోయిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు… చివరకు ఉన్న సరస్సులో నీటిని నిల్వచేసేలా ప్రభుత్వం అక్విడేట్ లు నిర్మిస్తే రెండు జిల్లాలకు పుష్కలంగా అన్నీరంగాలకు నీరు అందుతోంది.పాలకులు మారినా… ప్రభుత్వాలు మారినా… కొల్లేరు సరస్సు దుస్ధితి మాత్రం మారలేదు. ఐదు నియోజకవర్గాలను ప్రభావితం చేసే కొల్లేరు ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ముందు అన్నీ రాజకీయ పార్టీలు హామీలు గుప్పించేస్తారు. అధికారంలోకి ఎవరు వచ్చినా చివరకు చేసేదేమీ ఉండదు… అనేక దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. తాజాగా మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నకావడంతో కొల్లేరుపై రాజకీయ నాయకులు కపటప్రేమకు తెరలేపారు… కొల్లేరులో నిండు కుండలా నీరుండాలి అంటే రెండు అక్విడేట్ లు నిర్మించాలి. ఈ ప్రాంత ప్రజల తాగునీటి, రైతుల సాగునీరు, అక్వా కల్చర్ అభివృద్ది చెందాలంటే కొల్లేరులో నీరెంతో అవసరం… దీనికోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా మెరపెట్టుకుంటున్నా నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు… రెండు అక్విడెట్లు కడితే కొల్లేరులో నీరుంటుందని, అప్పుడు ఈ ప్రాంతానికి నీటి కొరత పూర్తిగా తీరిపోతుందని, అదేవిధంగా పర్యాటక రంగం పెరుగుతుందని కైకలూరు గ్రామస్ధలు అంటున్నారు…
కొల్లేరు సరస్సు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో విస్తరించి ఉంది… దాదాపు 78 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతీ ఏటా వర్షకాలంలో ఎగువున ఉన్న డ్ర్టైన్లు నుంచి వచ్చే నీరంతా సరస్సుకు చేరుతుంది. ఆ టైమ్ లో సరస్సు నిండు కుండలా కనిపిస్తుంది… ఈ ఒక్క సీజన్ లోనే సుమారు లక్ష క్యూసెక్కుల వర్షపు నీరు సరస్సుకు వస్తుంది… కొల్లేరులో ఈ పరిస్ధితి జూన్ నుంచి మొదలైయ్యి… జనవరి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ ఆరేడు నెలల కాలంలోనే రెండు లక్షల ఎకరాలలో ఆక్వాసాగు జరుగుతుంది… ఆ తర్వాత కాలమంతా సమృద్దిగా నీరు లేక ఆక్వాసాగు సగానికిపైగా తగ్గిపోతుంది… కొందరు మాత్రం బోర్లు ద్వారా, ఇతర మార్గాలు ద్వారా నీటి తీసుకొచ్చి సాగు సాగిస్తున్నారు… అక్కడ నుంచి మళ్లీ జూన్ వచ్చే వరకు చెరువులు ఎండిపోతాయి… మరోవైపు సరస్సులో వేటాడుకుని జీవనం సాగించే వేలాది కుటుంబాలకు ఆధారం లేక వలసలు వెళ్లిపోతున్నారు. సరస్సులో నిత్యం ఐదారు అడుగులు నీటిమట్టం ఉండేలా చూడాలని కోరుతున్నారు. ప్రతీ ఏడాది వర్షపు సీజన్ లో వచ్చే నీటిని నిల్వ చేయగలిగితే ఏడాది పొడవునా సరస్సులో కనీస నీరు ఉంటుందని స్ధానికలు అంటున్నారు. ఇందుకు ప్రభుత్వం కొద్దిపాటి చర్యలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
.కృష్ణ గోదావరి నదులకు భారీగా వరదలు వచ్చి వేల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీటిని కొల్లేరు సరస్సుకు తరలించాలని సిఎం చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు ద్వారా పట్టుసీమ నుంచి గోదావరి నీటిని సరస్సుకు మళ్ళించాలని ఆదేశించారు. వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని కొల్లేరుకు మళ్లిస్తే వేలాది ఎకరాల్లో ఆక్వా సాగు వల్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అలా జరిగినా… సరస్సులో నీరు కూడా నిల్వ ఉండాలంటే రెండు అక్విడేట్లు నిర్మించాల్సి ఉంది. కలిదిండి మండలం కొండంగి గ్రామం వద్ద, బంటుమిల్లు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద ఈ అక్విడేట్లు ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిని నిర్మిస్తే కొల్లేరుకు వచ్చి నీరు నిల్వఉండి అనేక రంగాలకు లాభదాయకంగా ఉంటుంది. దీనిపై ఎన్నిసార్లు స్ధానిక ప్రజా ప్రతినిధులకు మెరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే జయమంగళవెంకట రమణ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, ఎంపి మాగంటి బాబులు ఈ అక్విడెట్లు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు… త్వరలోనే వాటిని నిర్మించేలా చూస్తామని తెలిపారు.ఈ అక్విడెట్లు నిర్మాణం జరిగితే కొల్లేరు సరస్సుకు మంచి రోజులు వచ్చినట్లే… నీటి పరమైన అవసరాలు తీరడమే కాకుండా పర్యాటకం రంగానికి ఎంతో మేలు చేకూరతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *