ఎన్నికలంటే…ఆచి తూచి స్పందిస్తున్న జగన్

0

ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే ఆ పార్టీ స్వీప్‌ చేసింది. ముందు పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు విజయం సాధించిన తరువాత…ఆ పార్టీ పక్కకు వచ్చిన ఎమ్మెల్యేల్లో తొంభైశాతం విజయాలు సాధించారు. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మనదే…! ఫలానా మంత్రి నాకు…ఆ పదవి నాకు..అంటూ..ఎన్నికలకు ముందే…పదవులు పంచుకున్నారుఆ పార్టీ నాయకులు. కానీ..వారు అంచనాలను ‘ఆంధ్రా’ ‘జనం’ తిరస్కరించి…టిడిపికి అధికారం కట్టబెట్టారు..! పొరపాటున…తమ పార్టీ ఓడిపోయిందని..’నంద్యాల’ ఉప ఎన్నికల్లో సత్తా చూపిస్తామని చంద్రబాబు’ ఇంటికేనని..ఆ పార్టీ…ఒకటే ఇదై పోయింది. అయితే ‘నంద్యాల’ ఓటర్లు ఆ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడంతో…ఇక అప్పటి నుంచి ఎన్నికలంటే…ఆ పార్టీ వణికిపోతోంది. ఇప్పుడు ఎక్కడైనా ఉపఎన్నికలు జరుగుతాయన్నా…లేక తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నా…తాము పోటీ చేసేది లేదని..తేల్చి చెప్పిన ఆ పార్టీ ఏది అనుకుంటున్నారు. ఇంకేది…యువనేత వై.పస్‌.జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ. ఎన్నికలంటే…వైకాపాకు నల్లేరుపై నడకే. పార్టీ స్థాపించిన వెంటనే ఎమ్మెల్యే పదవికి…’విజయమ్మ, ఎంపీ పదవికి ‘జగన్‌’ రాజీనామాలు చేసి రికార్డు మెజార్టీతో మళ్లీ ఎన్నికయ్యారు. తరువాత…తన పక్కన చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి..సంచలన విజయాలు సాధించి..ఇక ఆంధ్రాలో తాను అధికారాన్ని చేపట్టకుండా..ఎవరూ ఆపలేరన్నంతగా చెలరేగిపోయారు. కానీ..’జనం’ మరో రకంగా తీర్పు ఇవ్వడంతో…’జగన్‌’ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. అయితే రెండేళ్ల తరువాత వచ్చిన ‘నంద్యాల’ ఉపఎన్నికల్లో సత్తా చాటి ‘చంద్రబాబు’ను బెదరగొడదామంటే…అక్కడా పరువు పోయింది. ఇక దీంతో ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా..పరువు పోతుందన్న భయంతో…ఎన్నికలంటే..’జగన్‌’ అండ్‌ కో పారిపోతున్నారు. ఆంధ్రాకు ప్రత్యేకహోదా…ఇవ్వలేదని..దానికి నిరసనగా తమ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని..ఒకటే హడావుడి చేసిన ‘జగన్‌’ చివరకు..వారు రాజీనామా చేసినా..ఎన్నికలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని…రాజీనామాలను ఆమోదింపచేసుకున్నారు. దీనిపై ప్రత్యర్థులువిమర్శలు చేసినా..ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించి మరోమారు..ఎన్నికలంటే తనకు ఎంత భయమో…’జగన్‌’ నిరూపించుకున్నారు. అదే విధంగా గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టబద్రుల ఎన్నికల్లో కూడా పోటీ చేసేది లేదని…పరోక్షంగా చెబుతున్నారట. మొత్తం మీద..ఒకప్పుడు ఎన్నికలంటే..సై..సై అనే ‘జగన్‌’ అండ్‌ కో..ఇప్పుడు ఎన్నికల పేరెత్తితేనే పారిపోతున్నారని ‘స్వంత’ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.

Share.

About Author

Leave A Reply