ధర్మానకు జగన్ చెక్

0

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అలాగే పార్టీలో క్రియాశీలంకంగా లేనివారిని పక్కన పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం నేత ధర్మాన ప్రసాదరావుకు జగన్ చెక్ చెప్పనున్నారని భోగట్టా. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పేరుమోసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరకాలంలో ధర్మాన తన వాగ్దాటితో ఆనాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మెప్పు పొందారని చెబుతుంటారు. ఈ నేపధ్యంలోనే వైఎస్ హయాంలో కీలకమైన పలు శాఖలను ధర్మాన నిర్వహించారు. కాగా వైఎస్ దివంగతులయ్యాక ధర్మానకు కష్టాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తుంటుంది. వైఎస్ ఉన్న సమయంలో ధర్మాన శ్రికాకుళం జిల్లాలో చక్రం తిప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ సమయంలోనే ధర్మాన టీడీపీని ముప్పుతిప్పలు పెట్టారనే వార్తలు వినిపిస్తుంటాయి. దీనికితోడు 2009 లో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు రావడం వెనుక ధర్మాన కృషి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతుంటారు. వైఎస్ మరణించాక ధర్మాన డీలా పడినట్టు కనిపిస్తున్నారని అంటుంటారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ధర్మాన శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.దీంతో శ్రీకాకుళం జిల్లాలో పార్టీని గెలిపించలేదన్న కారణంతో జగన్.. ధర్మానను కొన్నాళ్ళు పక్కన పెట్టారనే వార్తలు వినిపించాయి. దీనికితోడు టీడీపీ పెద్దలతో ధర్మాన మంతనాలు సాగిస్తున్నానే అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ జగన్.. ధర్మానకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. అలాగే శ్రీకాకుళంలో పార్టీని గాడిన పెట్టమని ధర్మానను జగన్ ఆదేశించారని తెలుస్తోంది. అయితే తాజాగా విశాఖ భూ కుంభకోణాలపై వచ్చిన సిట్ నివేదికలో ధర్మాన పేరు రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ధర్మానపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ధర్మాన చేసిన అక్రమాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయని, ఇక ఆయనకు శిక్షలు పడడం తప్పదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు ధర్మాన పనితీరు పై అసంతృప్తిగా ఉన్న జగన్ ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ధర్మానకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కూడా కష్టమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Share.

About Author

Leave A Reply