రెండో పెళ్లి చేసుకున్నాడన్నఅగ్రహాంతో……..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజుఫర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. రెండో పెళ్లి చేసుకొని తనని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అగ్రహాంతో భర్త జననేంద్రియాలను మొదటి భార్య కోసేసింది. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముజఫర్‌నగర్‌లోని నిమాల్నా ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొదటి భార్యకు పిల్లలు కలగకపోవడంతో ఆమె సమ్మతితోనే బాధితుడు రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రెండో భార్యకు పిల్లలు పుట్టడంతో ఆమె వద్దనే ఎక్కువగా ఉంటున్నాడనే కోపంతో మొదటి భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com