వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన ప్రీతీ

పదకొండేళ్లలో 300 చిన్నారులను అక్రమంగా దేశం దాటించిన ముఠా గుట్టురట్టయ్యింది. ఓ సినీ నటి ఫిర్యాదుతో ముఠా అక్రమాలు బయటకొచ్చాయి. ఈ ముఠా ముంబై నుంచి అమెరికాకు బాలలను తరలించినట్టు విచారణలో వెలుగుచూసింది. ఈ ముఠాకు నాయకత్వం వహించిన గుజరాత్‌ వాసి రాజుభాయ్ గమ్లేవాల్‌తో సహా నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గమ్లేవాలా ముఠా 2007 నుంచి ఇప్పటి వరకు 300 మంది బాలికలను అమెరికాకు అక్రమంగా తరలించి విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ముఠా తరలించిన చిన్నారులంతా గుజరాత్‌‌లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 11 నుంచి 16 ఏళ్ల లోపు వారేనని పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో బాలికను రూ. 45 లక్షలకు న్లకు విక్రయించినట్టు విచారణలో వెల్లడైంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని, వారికి డబ్బు ఆశ చూపి బాలికలను దొంగ పాస్‌పోర్టుతో దేశం దాటించేవారు. చిన్నారులను దేశం దాటించే ముందు వారిని అందంగా అలంకరించడానికి ముంబైలోని ఓ పార్లర్‌కు తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో గత మార్చిలో వెర్సోవాలోని ష్రింగర్ సెలూన్‌కు ఇద్దరు బాలికలను తీసుకురాగా, వారిని చూసిన సినీ నటి ప్రతీసూద్ అనుమానించింది. మైనర్ బాలికలకు తీసుకొచ్చిన వ్యక్తులు మేకప్ ఎలా వేయాలో పార్లర్ సిబ్బందికి సూచించడంతో ఆమె వారిని ప్రశ్నించింది. పిల్లలను అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామని పొంతనలేని సమాధానం చెప్పారు. ఆ వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం రమ్మంటే నిరాకరించడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు పట్టించింది. మరో వ్యక్తి బాలికలను తీసుకుని పరారయ్యాడు. ప్రీతిసూద్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంచడంతో కళ్లుబైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. ఈ ముఠాలో రిటైర్డు ఎస్సై కుమారుడి పాత్ర ఉన్నట్టు తేలింది. అంతకు ముందు నలుగురు నిందితులు అమీర్ ఖాన్ (26), తాజుద్దీన్ ఖాన్ (48), రిజ్వాన్ చోటానీ (39), అఫ్జల్ షేక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిచ్చిన సమాచారంతో రాజుభాయ్ గమ్లేవాలను సోమవారం అహ్మాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని నిరుపేద కుటుంబాల్లోని బాలికలను గుర్తించి, వారిని అమ్మడానికి తల్లిదండ్రులను ఒప్పించాలని గమ్లేవాలా తన ముఠా సభ్యులకు సూచించేవాడు. అలాగే వేరే చిన్నారుల పేరుతో ఉన్న పాస్‌పోర్టులను అద్దెకు తీసుకుని, వారి ఫోటోల స్థానంలో అక్రమంగా తరలించే బాలికల ఫోటోలను అతికించి అనుమానం రాకుండా ఉండేందుకు వారికి బాగా మేకప్ వేసేవారు. వారిని అమెరికా తీసుకెళ్లిన తర్వాత అద్దెకు తీసుకున్న పాస్‌పోర్ట్ తిరిగి అప్పగించేవారని గుర్తించారు. గమ్లేవాలా 2007లో పాస్‌ఫోర్ట్ ఫోర్జరీ కేసులో పట్టుబడ్డినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com