నిధులు ఎందుకు అడగలేదు

సీఎం కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన ఐదు రోజుల్లోనే ప్రాణహితకు జాతీయహోదా కావాలని కేంద్రానికి లేఖ రాసి కెసిఆర్ చిత్తశుద్ది చాటుకున్నారన్నారు హరీష్ రావు. ప్రధానిని ఎప్పుడైనా ప్రాజెక్టు నిధుల గురించి అడిగారా అని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం నాడు అయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టు గా కేంద్ర ప్రభుత్వం పరిగనిస్తే కేంద్రం 90శాతం నిధులు ఇస్తుంది. కేంద్రాన్ని నిధులు అడగకుండా రుణ భారం పెంచేశారు. ప్రజల సెంటిమెంట్ తో ఆడుకుంటూ ప్రాజెక్టు డిజైన్ మార్చారు. కేంద్ర నిధుల కోసం కృషిచేయకుండా…రీ-డిజైన్ చేసి కమీషన్ల కోసం ఆరాటపడుతున్నారని అయన విమర్శించారు. జాతీయ ప్రాజెక్టు సాధించాలనే చిత్తశుద్ధి టి.ఆర్.ఎస్ సర్కార్కు లేదు. జాతీయ ప్రాజెక్టు అయితే అవినీతికి ఆస్కారం ఉండదు. అందుకే జాతీయ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేయడంలేదని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com