కార్తీకం లో చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు?

0

స్నానము అనేది శరీర శుభ్రతకోసము . అది ఏకాలమౌలో చేసినా ఏవిధముగా చేసినా అంతిమ ఉపయోగము ఆరోగ్యము కాపాడుకోవడమే.

ఉదయానే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో బాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న ఉష్ణశక్తి ని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి ఉష్ణశక్తి ని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి ఉష్ణశక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది.

మనలో నిరంతరం విద్యుత్తు(ఉష్ణశక్తి) ప్రవహిస్తూ, విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో విద్యుచ్ఛక్తి కొత్తగా తయారౌతూ, బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను “electro-magnetic activity” అంటారు.

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు ..సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను ..పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ. . సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ .. పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

కార్తీకములో పుణ్యమకోసము స్నానాలు చేసే స్నాన విధాలు ;

1 . దివ్య స్నానం: ఉత్తరాయణం లో ఎండ తో పాటు , వాన కురుస్తున్నప్పుడు నిలిచి స్నానం ఆచరించటం .

2. ధ్యాన స్నానం : గంగ, యమున, సరస్వతి మొదలైన పుణ్య నదులను తలచుకొని ఆ జలంతో స్నానం చేయటం .

3. మంత్ర స్నానం : మంత్రాలను ఆచరించే స్నానం మృత్తికా స్నానం అంటే మంత్రాలు పఠిస్తూ పవిత్ర ప్రదేశాలనుండి తెచ్చిన మృత్తిక తో ఆచరించిన స్నానం .

4 . మాన స్నానం : విభూతిని శరీరం మొత్తం పూసుకొని స్నానం చేయటం దీన్ని మహేశ్వరున్ని స్మరిస్తూ చేస్తారు .

5.వారుణ స్నానము : గోవిందా , హర హర అనో దేవుని తలచుకొని స్నానము చేయుట .

6.కాపిల స్నానము : శరీరము పైబాగాన ఏదైనా గాయము , పుండు ఉన్నచో … బొడ్డు దిగువ భాగము పాదాలవరకు నీటితో స్నానము చేసి , బొడ్డు పై శరీరభాగాన్ని తడిగుడ్డతో తుడుచు కోవడము .

7.ఆతప స్నానము : శరీరము ఏవిధముగానైనా తడపనీయకుండా అనారోగ్యము చుట్టిముట్టి ఉన్నవారు .. లేదా తీవ్రమైన నీటికొరత ఉన్నప్పుడు .. ఎండలో గోవిందనామము ఉచ్చరిస్తూ కొంతసేపు ఉంటే అది ఆతప స్నానము అవుతుంది.

8. మానస స్నానము : పై స్నాన విధాలు ఏవిధంగాను సహకరించని వారు … నేను స్నానము చేస్తున్నాను అని భావించి , శరీరము అలా తడుపుతున్న భావనతో ఉండి కొంతసేపయ్యేక పరమేశ్వరుని స్నానము చేస్తూన్న ఓ దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకొని చూడగలిగితే చాలు అది మానస స్నానము అవుతుంది.

Share.

About Author

Leave A Reply