.హైదరాబాద్ లో వైట్ ట్యాపరింగ్ రోడ్లు

హైదరాబాద్ నగరంలో అద్బతంగా ఉండాలనే సంకల్పంతోటి గ్రేటర్ హైదరాబాద్ లో 1300 కోట్ల రూపాయలతో వైట్ ట్యాపరింగ్ రోడ్లు వేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైట్ ట్యాపరింగ్ రోడ్లు 25 సంవత్సరాల వరకూ లైఫ్ ఇస్తాయని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండి రోడ్లు బాగలేని చోట వైట్ ట్యాపరింగ్ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం మూడు చోట్ల 69 కోట్ల తో వైట్ ట్యాపరింగ్ రోడ్లు వేస్తున్నామని అన్నారు. మినిస్టర్ రోడ్డు నుంచి రాణిగంజ్ వరకూ, గ్రీన్ పార్క్ అమీర్ పేట్ రోడ్డు, కనకదుర్గా దేవాలయం నుంచి బల్కంపేట్ మీదుగా ముసాపేట్ ఫతేనగర్ వరకూ వైట్ ట్యాపరింగ్ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. వాహానదారులు ఏ కోంచేం దారి ఉన్న ఆ దారిగుండా వేళుతున్నారని దానితో రోడ్లు నాశనం అవుతున్నాయని, రోడ్ల పనులు పూర్తి అయిన తర్వాత మాత్రమే వేళ్ళాలని కోరారు. స్దానిక ప్రజలు, వ్యాపారస్ధులు, వాహానదారులు సహారించాలని సూచించారు మంత్రి తలసాని.. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పోరేటర్లతోపాటు జిహెచ్ఎంసి అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com