అర్హులైన అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులంద‌రికి వేత‌నాలు సాంకేతిక కార‌ణాల వ‌ల్లే అర్చ‌కుల వేత‌నాల చెల్లింపులో జాప్యం: మ‌ంత్రి అల్లోల

అర్హులైన అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులంద‌రికి త్వ‌ర‌లోనే వేత‌నాలు చెల్లిస్తామ‌ని గృహ నిర్మాణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్లే వేత‌న చెల్లింపులో జాప్యం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల వేత‌నాల‌పై మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు.ఈ స‌మావేశంలో వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్,జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ…131 ఆల‌యాల‌కు సంబంధించిన 6 (బి), 6 (సి) & 6 (డి) క్యాట‌గిరి క్రింద ఉన్న అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల డాటా ఇంకా ఆన్ లైన్ చేయ‌బ‌డలేద‌న్నారు. ఈ 131 ఆల‌యాల్లో ప‌ని చేస్తున్న వారితో పాటు, అర్హ‌త‌లు ఉన్న లిస్ట్ లో త‌మ పేరు లేద‌ని కొంత‌మంది నుంచి ఫిర్యాదులువ‌చ్చిన‌ నేప‌థ్యంలో వారి సాధ‌క‌భాద‌కాల‌ను నివేదించుకునేందుకు ఓ కమిటీని నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. దేవాదాయ శాఖ ప‌రిధిలో 646 అసెస‌బుల్ ఇనిస్టిట్యూష‌న్స్ ఉన్నాయ‌ని, రివైజ్డ్ వేత‌నాలు ఇవ్వాలంటే ముందుగా ఇనిస్టిట్యూష‌న్ వైజ్ క్యాడ‌ర్ స్ట్రెంత్ ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంద‌ని,త‌ర్వాత‌ ఆన్ లైన్ వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 484 ఇనిస్టిట్యూష‌న్స్ లో క్యాడ‌ర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయ‌డం జ‌రిగిందని వెల్ల‌డించారు. మిగితా 162 ఇనిస్టిట్యూష‌న్స్ క్యాడ‌ర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయాల్సి ఉందని తెలిపారు. 515 ఇనిస్టిట్యూష‌న్స్ లో ప‌ని చేస్తున్న అర్చ‌కులు,ఆల‌య ఉద్యోగులు త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేశారని, మిగితా 131 ఇనిస్టిట్యూష‌న్స్ వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉందన్నారు. ఈ 131 ఆల‌యాల‌కు సంబంధించిన 6 (బి), 6 (సి) & 6 (డి) క్యాట‌గిరి క్రింద ఉన్న ఇనిస్టిట్యూష‌న్స్ ,వీటిలో అధిక భాగం ఆల‌య భూములు అర్చ‌కులు ఆధీనంలో ఉన్నాయన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1903 మందికి రివైజ్డ్ వేత‌నాలు ఇప్ప‌టికే వారి ఖాతాల్లో వేయ‌డం జ‌రుగుతుందని,1500 మందికి సంబంధించి స్క్రూటినీ పూర్తైందన్నారు. ఈ నెలాఖరు వ‌ర‌కు వారి ఖాతాల్లో రివైజ్డ్ వేత‌నాలు జ‌మా చేయ‌డం జ‌రుగుతుందని స్ప‌ష్టం చేశారు. మిగితా వారికి ఆన్ లైన్ డాటా మ‌రియు క్యాడ‌ర్ స్ట్రెంత్ ఫిక్స్ చేసిన వెంట‌నే వేత‌నాలు చెల్లించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com