వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్ వై93

0

వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్ వై93 తాజాగా చైనాలో విడుదల అయింది. కొత్తగా విడుదలైన ఈ వై-సిరీస్ మోడల్ లో అధునాతన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ని ఏర్పాటు చేశారు. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీ బ్యాక్అప్ తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్టార్రి నైట్, రెడ్ కలర్లలో లభించే ఈ ఫోన్ ధర సుమారుగా రూ.15900గా ఉండే అవకాశం ఉంది.

  • 6.20″ హెచ్‌డీ డిస్ప్లే (720×1580 పిక్సెల్ రిజల్యూషన్ )
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 256జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (ఫన్ టచ్ ఓఎస్ 4.5)
  • 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4030 ఎంఏహెచ్ బ్యాటరీ
Share.

About Author

Leave A Reply