విజయ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమానులు

0

ఇప్పటి వరకూ ఏ నటుడికీ దక్కని అదృష్టం తమిళ హీరో విజయ్‌కు దక్కింది. ఆయనకు తమిళనాడులోనే కాకుండా కేరళలోనూ అభిమానులున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన చిత్రం ‘సర్కార్’ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేరళ అభిమానులు విజయ్ కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్‌ను రూపొందించి శనివారం మలయాళ నటుడు సన్నీ వెయిన్ చేత ఆవిష్కరింపజేశారు. అంతేకాదు, విజయ్ పేరిట సేవా కార్యక్రమాలు చేసేందుకు రూ.లక్ష విరాళంగా సేకరించారు. ఇక తొలిసారి విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సర్కార్ చిత్రంలో కీర్తి సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.

Share.

About Author

Leave A Reply