డోరా ని గుర్తు చేస్తోన్న టాక్సీవాలా

0

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన ‘టాక్సీవాలా’ ఈ నెల 17వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాతో రాహుల్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.  నిన్నరాత్రి ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. టాక్సీవాలా అయిన విజయ్ దేవరకొండ .. తన కారులో దెయ్యం ఉందని భయపడటం చూపించారు. నయనతార ప్రధాన పాత్రగా గతంలో వచ్చిన ‘డోరా’ను ఈ ట్రైలర్ గుర్తు చేస్తోందనేది ఫిలింనగర్ టాక్. ఆ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోను డ్రైవర్ లేకుండానే కారు దూసుకుపోతోంది. దాంతో చాలామంది ‘డోరా’ మాదిరిగా ఉంటుందేమోనని భావిస్తున్నారు. కానీ కారులో ఆత్మ ప్రవేశించడం ఒక్కటి మినహా, ‘డోరా’కథకి ఈ కథకి ఎక్కడా పోలికలు ఉండవని ఈ సినిమా టీమ్ చెబుతోంది. ప్రియాంక .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Share.

About Author

Leave A Reply