చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూడడానికి ఎదురుచూస్తున్న నటుడు ఎవరు?

0

Chiranjeevi-venkatesh-Balakrishna_apduniaఈ సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు చూడడానికి మరో పెద్ద హీరో ఎదురు చూస్తున్నారట. ఎంతకీ ఆ హీరో ఎవరు అనేగా మీ ప్రశ్న. ఆయనేనండి విక్టరీ వెంకటేష్. ఈసారి సంక్రాంతి తెలుగువారింట మరింత ఘనంగా జరుగుతుందని వెంకటేష్ తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంక్రాంతి సినిమాల గురించి పోస్టు చేసిన వెంకటేష్ తన ఇద్దరు స్నేహితుల సినిమాలు చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘ఈ సంక్రాంతిని మనం మరింత సంతోషంతో, సంబరాలతో జరుపుకోవడానికి ఓ కారణం ఉంది. ఈ రెండు చిత్రబృందాలకు ఆల్‌ ది బెస్ట్‌. చిరు, బాలయ్యలను వెండితెరపై చూడటానికి ఇంకేమాత్రం ఆగలేను’ అని పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి ఓ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దిగిన ఫోటోను తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో వెంకటేష్ పోస్టు చేశారు.

Share.

Comments are closed.