ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటున్న వెంకీ 

0
pawan-kalyan-venkaetsh-apduniaపవన్ కళ్యాణ్ ఇమేజ్ మరే హీరోకి లేదనే చెప్పాలి. మెగా హీరోలే కాకుండా, కొందరు యవ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. 
వెంకీ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్టయిన ఇరుదు సుట్రు కు రీమేక్ గా గురు అనే చిత్రాన్ని చేస్తున్నాడు. బాక్సర్ గా తాను సాధించలేనిది తన శిష్యులతో సాధించాలని తపించే ఒక కోచ్ పాత్రలో వెంకీ నటిస్తోండగా, అతని శిష్యురాలిగా మాతృకలో నటించిన రితికా సింగ్ నటిస్తోంది. అయితే తమిళంలో కథానాయికని థనుష్ ఫ్యాన్ గా చూపించారు చిత్ర బృందం. మరి తెలుగుకి వచ్చే సరికి కథానాయిక ఫ్యాన్ గా ఏ హీరోని చూపించాలనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉండగా వెంకటేష్, పవన్ ని సూచించాడట.మొన్నటికి మొన్న కమెడీయన్ సప్తగిరి తన తాజా చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడుకకి పవన్ ని గెస్ట్ గా పిలిచి, అందరి దృష్టి తన సినిమాపై పడేలా చేశాడు. ఇక ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ తన సినిమాకు పవన్ ఇమేజ్ ని వాడుకోవాలని భావిస్తున్నాడట. పవన్ తో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఉండగా వీరిద్దరు కలిసి గోపాల గోపాల అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫ్యాన్ గా పవన్ నే చూపించాలని రిఫర్ చేసాడట వెంకీ. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన చాలాసార్లు రానుందని తెలుస్తోంది. మరి ఇది సినిమాకు ఎంత ప్లస్ అవుతుందనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు.
Share.

Comments are closed.