సెప్టెంబర్ 8న ఉప్పల్ లే అవుట్

హెచ్‌ఎం డీ ఎపతిష్టాత్మకంగా అభివద్ధి పరచిన ఉప్పల్‌ భగాయత్‌ లే-అవుట్‌ ప్లాట్లను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది. ఈ-వేలం ద్వారా 1,44,500.19 చదరపు గజాల విస్తీర్ణము గల మొత్తం 95 ప్లాట్లను అమ్మేందుకు నిర్ణచియించినట్టు తెలిపారు. ఇందులో ఉప్పల్‌ భగాయత్‌ 67 ప్లాట్లతో పాటు మిగిలిన 28 ప్లాట్లు ఇతర ప్రదేశాల్లో ఉన్నాయిఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల ఈ-వేలం సెప్టెంబర్‌ 8న ఉదయం 9.00 గంటల నుంచి నిర్వహించనుండగా, మిగతా ప్లాట్లు ఈ-వేలం సెప్టెంబర్‌ 9న నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఇందులో పాల్గొనే వారు ముందుగా రూ.500 (జీఎస్టీ అదనంగా) చెల్లించి తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. ఆసక్తిగలవారు సెప్టెంబర్‌ 6వతేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ-వేలంలో పాల్గొనే బిడ్డరు 10 శాతం రుసుం ఈఎండీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే దాంట్లో పాల్గొనే బిడ్డరు కనీసం రూ.100 ఎక్కువగా కోట్‌ చేయాల్సి ఉంటుందని, అధిక ధర కోట్‌ చేసిన వారికి ఈ-వేలం ప్రక్రియ ముగిసిన వెంటనే సమాచారం పంపించనున్నట్టు తెలిపారు. ఇక అత్యధిక ధరతో వేలంలో ప్లాటును దక్కించుకున్నవారు వారం రోజుల్లోపు 25 శాతం ధరను చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే 10 శాతం వడ్డీతో 90 రోజుల్లోపు, 12 శాతం వడ్డీతో 180 రోజుల లోపు, 15 శాతం వడ్డీతో ఏడాది వరకు మిగిలిన ధరను చెల్లించవచ్చని చెప్పారు. ఉప్పల్‌ భగాయత్‌ లే-అవుట్‌ కాకుండా మైలార్‌దేవర్‌పల్లి మధుబన్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ లో 6 ప్లాట్లు, నెక్నాంపూర్‌ రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌లో 2, అత్తాపూర్‌ రెసిడెన్సిషల్‌ కాంప్లెక్స్‌ లో 2, అనంతారంలో 2, బాచుపల్లిలో 2, దూలపల్లిలో 7, జాలపల్లి(పాపయ్య కుండం)లో 2, ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకోసం వెబ్‌ సైట్‌ చూడవచ్చునని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com