గంగూలీకి బెదిరింపు లేఖ

0

ganguly_apduniaటీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ పేరు వింటే అతని దూకుడే గుర్తుకొస్తుంది. ప్రత్యర్థులు మన జట్టులో ఉన్న ఆటగాళ్లను చిన్నమాట అన్నా గంగూలీ వాళ్ళపైకి బెబ్బులిలా దూకేవాడు. వాళ్ళు ఒకటి అంటే గంగూలీ నాలుగు మాటలు అనేవాడు. గంగూలీ దెబ్బకి ఆస్ట్రేలియా లాంటి జట్టు కూడా భయపడేది. ఒక సిరీస్ లో ఇండియా గెలిచిన తరువాత అతను తన షర్ట్ విప్పి ఆ షర్ట్ ను గాల్లో తిప్పుతో చేసిన విన్యాసం భారత క్రికెట్ అభిమానులెవరూ మరచిపోలేరు. అలాంటి గంగూలీకి ఇప్పుడు ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఒక యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమానికి అతను హాజరుకావద్దని బెదిరిస్తూ అజ్ఞాత వ్యక్తి లేఖ రాశారు. దీనిపై గంగూలీ మాట్లాడుతూ అవును నన్ను బెదిరిస్తూ జనవరి 7న ఒక లేఖ వచ్చింది. ఈ విషయన్ని తాను పోలీసులు, కార్యక్రమ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్ళాను అని చెప్పాడు. పశ్చిమబంగ రాష్ట్రం మేదినిపూర్ లో జనవరి 19న విద్యాసాగర్ యూనివర్సిటీ, జిల్లా క్రీడా సంఘం కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాలని గంగూలీని ఆహ్వానించారు. బెదిరింపు లేఖ వచ్చిన సందర్భంగా గంగూలీ హాజరవుతాడో లేదో తెలియాల్సి ఉంది.

Share.

Comments are closed.