ఇద్దరు చిన్నారుల మృతి

సికింద్రాబాద్ లోని చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం పైనుంచి ఇద్దరు చిన్నారులు కింద పడి మృతి చెందారు. ఏడాదిన్నర పాప శ్రేయ బిల్డింగ్ పైన ఆడుకుంటూ వెళ్ళింది. బిల్డింగ్ చివర ఆడుకుంటూ ప్రమాదంలో చిక్కుకుంది. బిల్డింగ్పై నుంచి పడిపోతున్న శ్రేయ ను చూసిన పల్లవి కాపాడేందుకు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తు ఇద్దరు బిల్డింగ్ పై నుంచి కిందపడిపోయారు. ఏడాదిన్నర శ్రేయ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలైన పల్లవిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ 10 సంవత్సరాల పల్లవి కూడా మృతి చెందింది. దీంతో చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com