తిరుపతి అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు

0
ttd-apduniaటీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులతో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పలు విషయాలపై నిశితంగా చర్చించి మండలి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. స్మార్ట్‌ సిటీ తిరుపతి అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. వకూళామాత ఆలయం నిర్మాణం చేపడతామన్నారు.ఏర్పేడు నుండి కాలేరు వరకు నూరు అడుగుల రోడ్డు విస్తరణ, సుందరికరణతో పాటు.86 లక్షలతో కొబ్బరి కాయలు కొనుగోళ్ళకు ఆమోదం   తెలిపారు.  10 కోట్లతో తిరుపతి రోడ్లు సుందరికరణకు, జీడిపప్పు ​కొనుగోళ్ళకు రూ. 9.34 కోట్లు కేటాయింపులకు ఆమోదం వ్యక్తం చేశారు.  రూ. 6.3 కోట్లుతో మూడు నెలలకు సరిపడిన బియ్యం కోనుగోళ్ళకు,  176 మంది పోటు కార్మికుల కాంట్రాక్టు పొడిగించడంతో పాటు… రూ. 4.7 కోట్లతో పలమనేరు వద్ద గోశాల నిర్మాణం,  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద రూ. 2.7 కోట్లుతో వేంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణ,  150 మంది డ్రైవర్ లకు జీతం పెంపు,  క్షురకులకు ఫీస్ రేటును రూ.11 కు పెంచనున్నారు. దీని వల్ల  టీటీడీ పై రూ. 4.5 కోట్లు అదనపు భారంపడనుంది. మరో వైపు  447 మంది అర్చకులు, పరిచారకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని అనుమతి కోరామని, ఉద్యోగుల ఇళ్ళ స్థలాలు సమస్యను పరిష్కరించేందుకు కమిటి ఏర్పాటు చేస్తామని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వివరించారు.
Share.

Comments are closed.