వేడుకల్లో్ విషాదం

ఒంగోలు మండలం పెళ్ళూరులోని ఎన్ సి సి కార్యాలయం దగ్గర విషాదం చోటు చేసుకుంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లలో ఉన్న ఇద్దరు జవాన్లు కరెంటు షాక్తో మృతి చెందారు. ఎన్ సి సి కార్యాలయం ఆవరణలో జెండా ఎగురవేసేందుకు ఇనుప పోల్ను ఏర్పాటు చేస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఇనుప పోల్ తగిలి కరెంట్ షాక్ తగిలింది. ఈ సంఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేట గ్రామానికి చెందిన హవాల్దార్ గాలి అప్పలనాయుడు, డార్జిలింగ్లోని డోలాగిరి జోన్ సింబోట్ గ్రామానికి చెందిన హవాల్దార్ బసంత్ రాణాగా గుర్తించారు. రాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరూ జెండా వందనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసి రంగు కాగితాలను అలంకరించారు. జెండాను ఎగురవేయాల్సిన పైపును ఇనుప దిమ్మకు అమర్చుతుండగా ఊహించని రీతిలో పైపు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలింది. దీంతో ఈ ఇద్దరు జవాన్లకు తీవ్రమైన కరెంట్ షాక్ తగిలింది. వీరిలో జవాన్ బసంత్ రాణా అక్కడిక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన అప్పల నాయుడును ఒంగోలు రిమ్స్కు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన ఎన్ సి సి కార్యాలయంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com