11:21 గంటలకు నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని

0

అనూహ్యంగా కూకట్‌పల్లి టికెట్ దక్కించుకున్న నందమూరి సుహాసిని నేడు నామినేషన్ వేయనున్నారు. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఇతర టీడీపీ నేతలతో కలిసి కూకట్‌పల్లి చేరుకుంటారు. 11:21 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఎటువంటి హడావుడి లేకుండా చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నందమూరి కుటుంబం భావిస్తోంది. కాగా, పలు అనూహ్య పరిణామాల తర్వాత కూకట్‌పల్లి నుంచి సుహాసిని బరిలోకి దింపారు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పెద్దరెడ్డిని కాదని, సుహాసినికి టికెట్ ఇచ్చారు. సుహాసిని గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. ఆమెను బరిలోకి దింపడం వ్యూహాత్మకమేనని, ఆ ప్రభావం మొత్తం మహాకూటమి నేతలపై పడుతుందని, వారి గెలుపు మరింత సులభం అవుతుందని టీడీపీ భావిస్తోంది.

Share.

About Author

Leave A Reply