బన్నీ అంటే చాలా ఇష్టం

0

కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఏర్పాటు చేసిన లైఫ్ స్టయిల్ షోరూమ్ ను ప్రారంభించాడు. అనంతరం అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులను తన డ్యాన్స్, స్టంట్స్ తో అలరించాడు. ఈ సందర్భంగా టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారని తెలిపాడు. హైదరాబాద్ కబాబ్, బిరియానీల గురించి విన్నాననీ, వాటిని రుచి చూస్తానని వెల్లడించాడు. తన తండ్రి జాకీ ష్రాఫ్ తెలుగు సినిమాల్లో నటించారని గుర్తుచేశాడు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. ఇక టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ (బన్నీ) అంటే చాలా ఇష్టమనీ, అవకాశం వస్తే బన్నీతో తప్పకుండా నటిస్తానని మనసులోని మాటను బయటపెట్టాడు.

Share.

About Author

Leave A Reply