బాలికల వసతి గృహంలో ఆనేక లోపాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీల బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి అనే ఉధ్యేశ్యంతో గొప్పలు చెప్పుకుంటూ గురుకులాలు నాణ్యమైన విద్యా, హాస్టల్స్ లో పౌష్టికాహారం విషయంలో ఎంతో లోపాలున్నాయని ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ ఛీప్ నెరెళ్ల శారద అన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని గిరిజన బాలికల హాస్టల్ లో ఈ విషయం తేటతెల్లమైంది. మహిళ సాధికారతే ముఖ్యం అనే ప్రభుత్వం, మహిళల భద్రతకోసం షీ టీమ్స్ అంటూ గొప్పలు చెపుతుంటారు. కానీ మేడిపల్లి గిరిజన బాలికల హాస్టల్ లో భద్రతే కరువైందని అమె ఆరోపించారు. హాస్టల్ విద్యార్థులకి సన్నబియ్యంతో పౌష్టికాహారం అంటున్న ప్రభుత్వం మేడిపల్లి గిరిజన హాస్టల్ లో పొద్దున సాయంత్రం అదే చారుతో అన్నం, హాస్టల్ లో చూడటానికి వారం పాటు ఒక్కొవెరైటీ మెనూ కనిపిస్తుంది. అది లెక్కలకొరకే సరిపోతుంది. కానీ ఆ గిరిజన బాలికలకు మాత్రం ఉదయం రాత్రి ఒకే సాంబారు, రైస్, ఆదివారం వొచ్చింది కదా అని ఆ బాలికలే చపాతి చేసుకుంధామంటే చపాతి పిండి వుండదు. వుంటే మాత్రం దానిండా పురుగులే, హాస్టల్ లో ఓకే వంటమనిషి, ఓకే వార్దెన్, అప్పుడప్పుడే వచ్చే వార్డెన్ కూడా ఉదయం వొచ్చి సాయంత్రం వెళ్తారు. 150మంది బాలికలకు వసతి ఉండే ఈ హాస్టల్ కి, 50మంది బాలికలు మాత్రమే ఉంటున్నారని ఆమె అన్నారు. . ఆ బాలికలు పడే ఇబ్బందులు ప్రభుత్వలోపాలుగా నిన్న సాయంత్రం తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నెరేళ్ల శారదా ఆకస్మిక తనిఖీ చేయగా ఆ హాస్టల్ గిరిజన బాలికల ఇబ్బందులు, ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన గిరిజన బాలికల పై ఉన్న ప్రేమ, ప్రభుత్వ నిర్లక్ష్య రూపంలో బట్టబయలైంది. అక్కడి హాస్టల్ విద్యార్థులు కూడా వారి వారి సమస్యలను, మీడియాకి మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలికి చెప్పుకున్నారు. శారద మాట్లాడుతూభద్రత లేని కారణంగా రాత్రి వేళలో ఎవరైనా దాడులకు పాల్పడితే ఎలా అని ఆ బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, హాస్టల్ గదిలోకి పాములు చేరుతున్నాయని పిల్లలు భయపడుతున్నారన్నారు శారదా. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇలాంటి హాస్టల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లేని యెడల మహిళ కాంగ్రెస్ నేతగా ప్రభుత్వంపై పోరాడుతానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com