గణపతి ఆలయంలో చోరీ

చైతన్య పురి ప్రబాత్ నగర్ కాలనీ లోని శ్రీలక్ష్మి గణపతి దేవాలయం లో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీ కి పాల్పడ్డారు. గురువారం ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. హుండీని దొంగిలించి పక్కన ఉన్న పార్కు లోకి తీసుకెళ్లి పగులగొట్టి నోట్లను తీసుకుని చిల్లర పైసలు వదిలివెళ్లినట్టు పూజారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్నిఫర్ డాగ్ , ఫింగర్ ప్రింట్ వారితో దర్యాప్తు చేపట్టారు. ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రత పరంగా , నిఘా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంలో కూడా రెండు సార్లు చోరీకి యత్నం జరిగిందని , ఇది మూడవ సారి అని అన్నారు. పక్కన ఫ్రూట్ మార్కెట్ ఉండడంతో అక్కడకు వివిధ రాష్ట్రాల వారు వస్తూ ఉంటారని వారిపై కుడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరుచూ దొంగతనానికి గురి కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com