అమరుల స్పూర్తితో రాష్టాన్ని అగ్రస్థానంలో నిలపాలి: అల్లం

ఎందరో అమరుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్య దినమని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.బుధవారంనాడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చైర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అమరుల స్పూర్తితో దేశాన్ని, రాష్టాన్ని అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. మహనీయులు కన్న కలలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి బి. రాజమౌళి, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, వనజ, ప్రసాద్, రహమాన్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com