ఫారూక్ ఇంట్లోకి చొరబడేందుకు వ్యక్తి ప్రయత్నం కాల్చి వేసిన భద్రతా సిబ్బంది

జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అక్కడి భద్రతా సిబ్బంది..ఆ వ్యక్తిని కాల్చేశారు. కారు ద్వారా అక్రమంగా ఇంట్లోకి వెళ్లేందుకు దూసుకొచ్చాడు. అయితే కారుతో ఫారూక్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం అయిన ఫారూక్ అబ్దుల్లాకు ప్ర‌స్తుతం జెడ్ ప్ల‌స్ సెక్యూర్టీ ఉంది. క‌శ్మీర్‌కు చెందిన మాజీ సీఎంలు ఒమ‌ర్ అబ్దుల్లా, గులాం న‌బీ ఆజాద్, మొహ‌బూబా ముఫ్తీల‌కు కూడా జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉంది. ఎస్‌యూవీ వాహ‌నంలో ఓ వ్య‌క్తి ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు య‌త్నించాడు. భ‌టిండిలో ఫారూక్ నివాసం ఉన్న‌ది. ఇవాళ ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఇదేమీ ఉగ్ర కుట్ర కాద‌ని ఎస్పీ వివేక్ గుప్తా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com