పోలీసులపై దాడి కేసులో నిందితుల గుర్తింపు

జిల్లాలోని రాపూర్ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన వారిని గుర్తించామని ఐజీ గోపాల్‌రావు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రక్షణ కల్పించే పోలీసులపై దాడి సరైన చర్యకాదన్నారు. పోలీస్ స్టేషన్‌పై 50 మంది దాడికిపైగా దాడి చేశారని అన్నారు. ఎస్ఐ లక్ష్మణరావు పనితీరు బాగోలేదనడం సరికాదని ఐజీ గోపాల్‌రావు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులతో కవాతు నిర్వహించారు. గతరాత్రి నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై సుమారు 50 మంది దాడికి తెగబడ్డారు. స్టేషన్ గేట్లు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ఎస్సై లక్ష్మణరావుపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఎస్సైను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. రాపూరు హరిజనవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ అనే ముగ్గురు అదే ప్రాంతానికి చెందిన జోసఫ్ అనే వ్యక్తికి బాకీ ఉన్నారు. బాకీ చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎ స్సై లక్ష్మణరావు.. పిచ్చయ్యతోపాటు మహిళలను విచారించేందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారు. మద్యం మత్తులో పిచ్చయ్య ఎస్సైను దుర్భాషలాడడంతో మెడికల్ చెక్పకోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న వారి బంధువులు స్టేషన్ వద్దకు చేరుకుని రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై విరుచుకుపడ్డారు. అడ్డువచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లపైనా దాడిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *