ఎన్టీఆర్ చరిత్ర ప్రపంచానికి తెలియాలి

తెలుగు జాతిని ప్రపంచ పటంలో ఎన్టీఆర్ ఎలా నిలబెట్టారనేదే చిత్ర ఇతివృత్తమని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. డైరెక్టర్ క్రిష్‌తో కలిసి నిమ్మకూరు వెళ్లిన బాలయ్య తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. క్రిష్ ఎన్టీఆర్ బాల్య స్మృతులను తెలుసుకున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర బృందం కృష్ణా జిల్లా నిమ్మకూరు చేరుకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంతూరులో పర్యటిస్తూ.. ఆయన జీవిత విశేషాలను తెలుసుకుంటోంది. ఎన్టీఆర్ బాల్యం, హీరోగా మారడం.. తదితర విషయాలను ఎన్టీఆర్ బంధువులు, సన్నిహితులు చిత్రయూనిట్‌తో చర్చించారు. ఎన్టీఆర్ దంపతులు విగ్రహానికి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం లొకేషన్లను అన్వేషిస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని బాలయ్య తెలిపారు. తండ్రి పాత్రలో తనయుడు నటిస్తుండటం ఇదే తొలిసారని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరును పుణ్యక్షేత్రంగా బాలయ్య అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నానని బాలయ్య తెలిపారు. ఈ సినిమాకు స్వర్గీయ ఎన్టీఆర్ కర్త, మేం కర్మ మాత్రమేనని క్రిష్ తెలిపారు. నిన్న సీఎం చంద్రబాబును కలిశామని. చంద్రబాబు పాత్రలో నటిస్తోన్న రానా కూడా మాతోపాటు సీఎంను కలిశారు. ఆయనతో మేమంతా చాలా సేపు మాట్లాడాం. ఎన్టీఆర్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మనకు తెలిసింది ఒక్క శాతమే. ఇప్పుడు చాలా తెలుసుకుంటున్నాం. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల్లో చూపించడం కష్టం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి కథను తెరకెక్కించే అవకాశం నాకు రావడం అదృష్టం. మాకు చాలా గొప్ప టీం లభించింద’’ని క్రిష్ తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న వీరిద్దరూ, సినిమాకు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలను నిమ్మకూరులో రెండు మూడు రోజుల పాటు చిత్రీకరించేందుకు నిమ్మకూరుకు చేరుకున్నారు .ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు తదితరాలను సినిమాలో కొంత చూపించాలన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ నిమ్మకూరుకు వచ్చింది. ఎన్టీఆర్ చిన్నప్పటి విశేషాలకు గ్రామంలోని పెద్దలను అడిగి తెలుసుకుని, కొన్ని ఆసక్తికర అంశాలను క్రిష్ ఈ చిత్రంలో చేర్చనున్నారు. తమ గ్రామానికి వచ్చిన చిత్ర టీమ్ కు అక్కడి ప్రజలు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *