ఉద్యానవన కేంద్రంగా రాయలసీమ : మంత్రి దేవినేని

కర్నూల్లో పులకుర్తి ఎత్తి పోతల పథకం చేపట్టడం సంతోషంగా ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాలో ఎత్తిపోతల పథకం చేపట్టడం ఎంతో మేలు చేస్తుందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రాజెక్టులకి 377 టీఎంసీ లు రావడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి..ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని అయన అన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసి హార్టీకల్చర్ హబ్ గా మారుస్తాం. శ్రీశైలం, నాగార్జున సాగర్ లు పూర్తిగా నిండాయి..సాగునీటి కాలువల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తోంది. ఇంటర్ స్టేట్ సమస్యలు తొలగించి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కి చంద్రబాబు కృషి చేస్తున్నారని అయన అన్నారు. చివరి ఆయకట్టు కి నీరు అందిస్తాం. 1656 టీఎంసీ లు సముద్రంలోకి వెళ్లాయి. ౩6.9 టీఎంసీలు లు పట్టిసీమ ద్వారా తీసుకున్నాం. జగన్ కి ఇరిగేషన్ మీద అవగాహన లేదు.అయన మొదట సబ్జెక్టు తెలుసుకోవాలి. పట్టిసీమ పైపులు పీకుతా అంటాడు. పట్టిసీమ ఉపయోగం తెలిస్తే అలా మాట్లాడరని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ కుట్రలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు.స్కూల్ ఎగగొట్టిన చిన్న పిల్లవాడిలా తిరుగుతున్నావు. ప్రభుత్వం మీద బురద జల్లి లబ్ది పొందాలని చూస్తున్నావ్. ప్రజలు అన్నీ చూస్తున్నారని అన్నారు. జగన్ కి ముఖ్యమంత్రి పిచ్చి పట్టిందని మంత్రి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com