పాడి రైతులకు పశువుల పంపిణీ పథకం ఓ బృహత్తర కార్యక్రమం టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్

టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాడి రైతులకు పశువుల పంపిణీ పథకం దేశంలోనే ఒక బృహత్తర కార్యక్రమమని, అన్ని వర్గాల పాడి రైతులకు ఈ పథకం ఎంతగానో లబ్ది చేకూరుస్తుందని టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రం లోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం గారు చేస్తున్న కృషి అమోఘమని పేర్కొన్నారు. మొన్నటి వరకు యాదవులకు గొర్రెలను పంపిణీ చేసి యాదవుల గుండెల్లో నిలిచిన కేసీఆర్ రాష్ట్రంలోని 1,82,823 మంది అర్హులైన పాడి రైతులకు బర్రెలను సబ్సిడీపై అందజేసేందుకు రూ. 15 కోట్లు వెచ్చించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 % , ఇతరులకు 50% శాతం సబ్సిడీపై బర్రెకు యూనిట్ విలువలో మూడేళ్ల పాటు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 300 కిలోల దాణా సరఫరా చేయడం సంతోషకరమన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తూ పద్మశాలిలకు,రజకులకు,ఎరుకలు మొదలగు బిసి వర్గాలకు భవనాలు నిర్మిస్తానని సిఎం పేర్కొనడం హర్షనీయమన్నారు. హైదరాబాద్ నగరం లో బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయేతర ఆదాయాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా చేపడుతున్న బృహత్తర పథకంతో పాటు వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన విషయమని ఆమే పేర్కొన్నారు. పాడిపశువుల పంపిణీ పథకాన్ని అర్హులైన పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొమ్ము ఉమాదేవి యాదవ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com