పవన్ కోసం రెడీ అవుతున్న బస్సు

మొన్నటివరకు అందుబాటులో ఉన్న కార్లలో తిరిగారు. ఏ ఊరిలో ఎక్కడ బస దొరికితే అక్కడే రాత్రిళ్లు గడిపారు. ఇకపై ఇలాంటివి ఉండవు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం ఓ లగ్జరీ ప్రచార రథం రెడీ అవుతోంది. పవన్ భవిష్యత్ పర్యటనలన్నీ ఇకపై ఈ వాహనం పైనే.పవన్ పై అభిమానంతో అతడి మిత్రుడు, టీవీ99 ఓనర్ తోట చంద్రశేఖర్ ఈ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో జనసేనానికి ఇది అందుబాటులోకి వస్తుంది. కారవాన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రముఖులతో సమావేశాలు జరుపుకోవచ్చు. కావాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. టీవీ, ఇంటర్నెట్ లాంటి సకల సౌకర్యాలు ఈ ప్రచార రధంలో ఉన్నాయి.ప్రస్తుతం ఏపీ రాజకీయ నాయకుల్లో అత్యంత ఖరీదైన ఇలాంటి వాహనం చంద్రబాబు దగ్గర ఉంది. ఆ వాహనం తర్వాత సకల హంగులు సంతరించుకున్న ఇసుజు కంపెనీకి చెందిన ఫుల్లీ-లోడెడ్ వాహనం ఇదే. వైఎస్ఆర్సీ అధినేత జగన్ వద్ద కూడా ఇలాంటి ఓ వాహనం ఉన్నప్పటికీ, అది కాస్త పాతది. జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు చాటిచెప్పేలా ఈ బస్సుపై పోస్టర్లు అతికించారు. ఇకపై తన పర్యటనల్లో ఈ బస్సుపై నుంచే పవన్ ప్రసంగిస్తారు. రాబోయే ఎన్నికల కోసం లోకేష్ కూడా ఓ కాస్ట్ లీ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ కోసం ఇప్పుడు రెడీ అవుతున్న బస్సును తలదన్నేలా అది రూపుదిద్దుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com