సార్వత్రిక ఎన్నికల్లో బిసి జెండా ఎగురవేస్తాం తెలంగాణా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి యుగందర్ గౌడ్

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిసిల జండా ఎగురవేస్తామని తెలంగాణా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి యుగందర్ గౌడ్ అన్నారు.సోమవారం సంఘం రాష్ట్ర కార్యాలయం లో బిసి మహిళా సంఘం ప్రదాన కార్యదర్శి ఆలంపల్లి లత తో కలిసి మాట్లాడారు.పార్లమెంటు నుండి పంచాయతి వరకు బిసి ల వాట బిసి లకే దక్కాలని ఈ నెల 7 నుండి తమ సంఘం రాష్ట్ర అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన తెలంగాణా బిసి చైతన్య బస్ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందల లబిస్తున్నట్లు తెలిపారు.బిసిల నుండి వస్తున్న ప్రజా స్పందనను చూసి అన్ని రాజకీయ పార్టీలు డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసారు. అలాగే అన్ని రాజకీయ పార్టీల లోని బిసి నేతలు బిసి వాదాన్ని వినిపించి రానున్న ఎన్నికల్లో బిసి లకు 50 శాతం రిజర్వేషన్స్ సాదించుకోవాలని వారు కోరారు.జనాభా దామాష ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్స్ కల్పించాలని,డిమాండ్ చేసారు.లేకుంటే బిసి ల ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందన్నారు.బిసి కమిషన్ కు చట్ట బద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా ప్రదాన మంత్రి నరేంద్రమోడికి వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశం లో సంఘం నాయకులు శివకుమార్ నాయుడు,బాల్రాజ్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com