రెండు నెలల్లో పదివేల ఉద్యోగాలు

భారతదేశంలో 50వేల లక్షల కోట్ల రూపాయలను విలువైన వ్యాపారాన్ని విదేశీ కంపెనీలు కబ్జా చేశారని యోగా గురువు ధ్వజమెత్తారు. దేశాన్ని విదేశీ వ్యాపారులనుంచి విడిపించడం కోసం దేశంలోని యువతకు ఉపాధి కల్పించాలని వారికి మనదేశ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి ఆయన చెప్పారు. మంగళవారం నాడు డిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న యోగ గురువు బాబ రామ్ దేవుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాబా మాట్లాడుతూ హైదరాబాద్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మందికి పతంజలి డిస్ట్రిబ్యూషన్ & సేల్స్ మేన్స్ లో ఉద్యోగాలు కల్పించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గడిచిన రెండు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు బాబా రాందేవ్ తెలిపారు. రాబోయే రెండు మాసాల్లో మరో పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మొత్తంమీద మార్కెట్ రంగంలో రాబోయే రోజుల్లో 20 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సమస్త లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ సంస్కృతిని విధానాలపైనా స్వాలంబన వ్యవసాయ రంగంలో కూడా భారతదేశంపై విదేశాలు కన్నేసి ఆయా రంగాల్లో మనదేశ ఉద్యోగాలు చేయించుకొని వారిని బానిసలుగా మారిందని ఆవేదన చెందారు కబంధ హస్తాలనుంచి భారతదేశ సంస్కృతి భాష ఏ విధమైన ఆహారం తినాలి ఎలా వ్యవసాయం చేసుకుని అనే అంశాలను సాంప్రదాయబద్ధంగా వివరించి వారిలో చైతన్యం తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com