టీడీపీ జాబితా అంతా సిద్దం

0

మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని స్థానాల్లో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. టీడీపీ పార్టీ అభ్యర్థులు తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలని ఒకరు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు తమకే టికెట్‌ కావాలని మరొకరు వీరందరికి కాకుండా టిజెఎస్‌ నుంచి టికెట్‌ కావాలని మరొకరు.. కాదు.. కాదు మాకే ఇవ్వాలని సీపీఐ ఇలా ఎవరి దారిలో వారు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. నీకా నాకా టికెట్‌ అంటూ అయోమయంలో అభ్యర్థులు సతమతం అవుతున్నారు. ఒక నియోజకవర్గంలో టిజెఎస్‌ పార్టీ నుంచి అభ్యర్థికి టికెట్‌ కేటాయించాలని ఒకరు పట్టుబడగా, మరొక నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచే టికెట్‌ ఇవ్వాలని అభ్యర్థులు ఆయా పార్టీల అధిష్టానం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో కూటమిలోని మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ అధిష్ఠానం కొంత కామ్‌గానే వ్యవహరిస్తోంది. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇక్కడి నేతలు సైలెంట్ అయిపోయారు. కొందరు ఆశావాహులు మాత్రం చివరి ప్రయత్నంగా హడావిడి చేస్తున్నారు. కూటమిలో టీడీపీకి కేటాయించే సీట్లపై క్లారిటీ వచ్చేసింది.మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలను కేటాయించబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా పూర్తయిపోయాయని, అధికారిక ప్రకటన చేయడమే తరువాయి అని తెలుస్తోంది. టీడీపీకి కేటాయించిన 14 స్థానాల్లో 11 ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, మక్తల్‌, దేవరకద్ర, ఉప్పల్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, నిజామాబాద్‌ రూరల్‌, కరీంనగర్‌ నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించనున్నట్లు తెలిసింది. నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మండవ వెంకటేశ్వరరావు, కరీంనగర్‌ నుంచి ఇ.పెద్దిరెడ్డిని బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఖమ్మం- నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట- మెచ్చా నాగేశ్వరరావు, మక్తల్‌- ఎర్ర శేఖర్‌, దేవరకద్ర- కొత్తకోట దయాకర్‌రెడ్డి, ఉప్పల్‌- టి.వీరేందర్‌గౌడ్‌, శేరిలింగంపల్లి- మొవ్వా సత్యనారాయణ, కూకట్‌పల్లి- భవ్యాస్‌ ఆనంద్‌ప్రసాద్‌, నిజామాబాద్‌ రూరల్‌- మండవ వెంకటేశ్వరరావు, కరీంనగర్‌ – ఇ.పెద్దిరెడ్డి పోటీ చేయబోతున్నారట. అయితే, పటాన్‌చెరులో పోటీ చేసే అభ్యర్థితో పాటు మిగిలిన మూడు స్థానాలు ఏంటనేవి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

Share.

About Author

Leave A Reply