మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

0

revanth-singer-apduniaబుల్లితెర ఆల్‌టైమ్ హిట్ షో ఇండియ‌న్ ఐడ‌ల్‌లో తెలుగు నేప‌థ్య యువ‌గాయ‌కుడు రేవంత్ టాప్ 12లోకి ఎంట‌ర్ అయ్యాడు. రేవంత్ తెలుగులో చాలా పాట‌లు పాడాడు. బాహుబ‌లిలో మ‌నోహ‌రి అనే పాట‌తో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. సూప‌ర్ సింగ‌ర్ పోటీల్లో పాల్గొని అక్క‌డి జడ్జీల మ‌న్న‌న‌లు పొంది ప్లేబాక్ సింగ‌ర్‌గా ఎదిగాడు .త‌న కెరీర్‌లో ఎన్నో హూషారైన పాట‌లు పాడాడు. సినిమా సింగర్‌గా అవ‌కాశం ఇచ్చిన‌ త‌న గురువు కీర‌వాణికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు రేవంత్ . ఇండియ‌న్ ఐడ‌ల్‌తో బాలీవుడ్‌లో కూడా పాట‌లు పాడాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు. అందుకు అంద‌రి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్న‌ట్లు తెలిపాడు.ఇంత‌కుముందు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో యువ‌గాయ‌కులు కారుణ్య ర‌న్న‌ర‌ప్‌గా నిల‌వ‌గా, శ్రీరామ‌చంద్ర ఇండియ‌న్ ఐడ‌ల్ టైటిల్ ద‌క్కించుకున్నాడు.

Share.

Comments are closed.