రాష్ర్టంలో పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారు ఒక కుటుంబానికే హస్తగతమైన తెలంగాణ రాష్ర్టం తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ

తెలంగాణ రాష్ర్టం కేవలం ఒక కుటుంబానికే హస్తగతమైందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జెండా ఎగురవేశారు. రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కటం లేదన్నారు. రాబోయే కాలంలో తెలుగు దేశం పార్టీ ద్వారానే అందరికి సమాన హక్కులు లభిస్తాయన్నారు. రాష్ర్టంలో పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారని, సంపన్నలు మరింత ధనవంతులుగా ఎదుగుతున్నారని విమర్శించారు. తెదేపా హయాంలోనే హైటెక్ సిటీ నిర్మించారని గుర్తు చేశారు. ఎందురో ప్రాణాలు అర్పించి సాధించిన తెలంగాణ అందరికీ సమానంగా ఉండాలన్నారు. సీనియర్ నేత దేవేందర్ గౌడ్ చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com