తెలంగాణను ముంచెత్తుతున్న వానలు

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితి, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో సీఎం మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.అదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల జన జీవనం స్తంభించిపోయింది. పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జైనత్‌లోని సత్‌నాలా ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరడంతో 3 గేట్లను ఎత్తివేశారు. ఇచ్చోడ మండలంలోని ఆడేగామ వద్ద వాగు పొంగి ప్రవహించడంతో అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.బోథ్‌, ఇచ్చోడ,బంజార్‌హత్నూర్‌, తాంసీ మండలాలతో పాటు ఆదిలాబాద్‌ పట్టణంలోనూ అంతర్గత రహదారులు జలమయమై లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు చేరింది. పలు ఇళ్లలో వరద నీరు చేరడంతో ఆహార ధాన్యాలు,వస్తు సామగ్రి తడిసిపోయాయి. అత్యధికంగా ఇచ్చోడలో 118 మిమీ, ఇంద్రవెల్లిలో 115మిమీ, నార్నూర్‌ 110మిమీ, ఉట్నూరు 109 మిమీల వర్షపాతం నమోదయ్యిందిఅటు ఎగువున కురుస్తున్న వానలతో కష్ణమ్మ పోటెత్తుతున్నది.. ఒకవైపు తుంగభద్ర.. మరోవైపు నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు దాటి శ్రీశైలం వైపుగా పరుగులు తీస్తున్నది. రెండు మూడు రోజుల్లో రెండువైపుల నుంచి వచ్చే జలాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగనున్నది. ఎగువన కురిసిన భారీవర్షాలతో ఆల్మట్టికి భారీ వరద వచ్చి చేరుతున్నది.భీంపూర్‌ మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని సెంటర్‌సంగి, ధనోరా, నిపాని గ్రామాల సమీపంలోని వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుల గుండా అంతరాష్ట్ర రహదారి ఉండటంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు 1.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణ్‌పూర్‌కు లక్ష క్యూసెక్కుల జలాలు వస్తుండగా, లక్షకు పైగా క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. జూరాలకు 90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుకున్నదిమరో వైపు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జిల్లాల్లో నియోజకవర్గాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారులు, పోలీసుల సహాకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి. సెక్రటరియేట్‌లో సీనియర్ అధికారి నాయకత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలి. ప్రజలు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్య ప్రజాప్రతినిధులు స్థానికంగా అందుబాటులో ఉండాల్సి ఉన్నందున శుక్రవారం జరిగే పార్టీ సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com