అవార్డుకు సామర్ధ్యాన్ని చెప్పే శక్తి లేదు!

0

tapsee-apdunia‘పింక్‌’ చిత్రంతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకుంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ చిత్ర విజయం తాప్సీకి మంచి పేరే తెచ్చిపెట్టడంతో బీటౌన్ లో గుర్తింపునూ తీసుకొచ్చింది. ‘పింక్‌’ తర్వాత తాప్సీకి అవకాశాలు బాగానే వస్తున్నట్లు టాక్. ‘జుడ్వా’ అనే పిక్చర్ లో అమ్మడు ఫైనలైజ్ అయిందని చెప్పుకుంటున్నా అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదే విషయమై తాప్సీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. “ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలా సంతోషిస్తా. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నంగా ఉండొచ్చు” అని వ్యాఖ్యానించింది. సల్మాన్‌ఖాన్‌ ద్విపాత్రాభినయంలో ఘన సూపర్ హిట్ అయిన చిత్రం ‘జుడ్వా’. రుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా ఈ చిత్రానికి సీక్వెల్‌ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు డేవిడ్‌ ధావన్‌. ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, తాప్సీలు కథానాయికలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పింక్‌’ సినిమాలో తాప్సీ నటనను చూసిన వారంతా ఆమెకు అవార్డులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంపైనా స్పందిస్తూ ‘‘అవార్డులు ఓ నటుడిలోని సామర్థ్యాన్ని నిర్ధారించలేవు. కాకపోతే వాటితో ఆ నటుడి నటనను మెచ్చుకున్నట్లుగా చెప్పుకోవచ్చు” అని తెలిపింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌ ప్రేక్షకులు తనను గుర్తిస్తున్నారని తెలిపిన తాప్సి చాలామంది ‘పింక్‌’ ఆమె మూడో చిత్రమని అనుకుంటున్నారట. అయితే తాను ఇప్పటికే దక్షిణాదిలో చాలా చిత్రాల్లో నటించానన్న విషయం స్పష్టం చేస్తూ ‘పింక్‌’ తనకు 21వ సినిమా అని చెప్పుకొచ్చింది.

Share.

Comments are closed.