పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న భరత్

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వారసత్వ పోరు రాజుకుంటుంది. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న నాయకులు ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో వారి కుమారులను రంగంలోకి దింపేందుకు స్కెచ్‌లు రెడీ చేస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్..తన తనయుడు టీజీ భరత్‌ను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపేందుకు వ్యూహాత్మంకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఎప్పటికప్పుడు సంచలన రాజకీయాలకు నెలవుగా ఉంటుంది కర్నూలు జిల్లా. ఇక అదే జిల్లాలో రాజకీయ చతురుడిగా పేరున్న వ్యక్తి టీజీ వెంకటేష్. శాసన సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన టీజీ ప్రస్తుతం టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా తన కుమారుడ్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నాడు అట టీజీ. టీజీ భరత్ కూడా ఇప్పడు ఫుల్ యాక్టివ్‌ ప్రొగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టీజీబీ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను జిల్లా అంతటా విస్తరించడమే కాకుండా కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నాడు భరత్. అయితే ఈ సారి కర్నూలు నుంచి శాసనసభకు వెళ్లాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాడట ఈ యువ నాయకుడు.అయితే ఇప్పుడు అదే అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు అది కూడా టీడీపీ నుంచి బరిలో ఉన్న టీజీ వెంకటేష్‌పై. తదనంతర పరిణామాలు దృష్యా ఎస్వీ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఇదే కర్నూలు సీటు విషయంలో భరత్‌కు, ఎస్వీ మోహన్ రెడ్డికి చాలాకాలం పాటు మాటల యుధ్దం కూడా జరిగింది. అయినప్పటికి కూడా ఎలాగైనా సీటు తననే వరిస్తుందనే నమ్మకంతో ఆయన చకచక కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ప్రత్యర్ది వర్గాన్ని ఢీ కొట్టేందుకు సామ, ధాన, భేద దండోపాయలను కూడా సిద్దం చేస్తున్నారట టీజీ రాజకీయ మధ్ధతుదారులు. అయితే ఇటీవల కర్నూలు పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ కర్నూలు ఎంపీగా బుట్టా రేణుకని, ఎమ్మేల్యేగా ఎస్వీ మోహన్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే ఇది చంద్రబాబు డెషీసన్‌నా? లేక లోకేష్ అభిప్రాయమా అనేది తేలాల్సి ఉంది. ఎవరికి వారు సీటు తమదే అన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. త్వరలో చంద్రబాబు డెషీషన్‌పై క్లారిటీ రాకపోతే మళ్లీ ఎస్వీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారని ఆయన అనుచరులు బాహటంగా చెప్పుకుంటున్నారుఇక ఇదే విషయానికి సంభందించి టీజీ వెంకటేష్ సన్నిహిత వర్గాలను సంప్రదించింది మహాన్యూస్ పొలిటికల్ బ్యూరో టీం. అయితే 2019 ఎన్నికలలో టీజీ భరత్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫార్మ్‌ గా ఉంటుందని అయితే ఎక్కడ నుండి బరిలో ఉంటారనే విషయం పార్టీ అదిష్థానం డిసైడ్ చేస్తుందని వారు చెప్పుకొచ్చారు. సో భరత్ వచ్చే ఎన్నికల బరిలో ఉండబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com