బాబు అవినీతిలో బీజేపీకి, పవన్ కు భాగస్వామ్యం లేదా? వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బినామీలు కలసి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బాబు అవినీతిలో బీజేపీకి, పవన్ కు భాగస్వామ్యం లేదా? అని ఆమెప్రశ్నించారు. బాబు అండతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నా, అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలసి డ్రామాలు ఆడుతున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ‘చంద్రబాబు అక్కడ ఇంత తినేశాడు, ఇక్కడ అంత తినేశాడు అని మీరు అంటున్నారు.. ఆయన అవినీతి గురించి మీ వద్ద ఆధారాలతో సహా ఉన్నప్పుడు… ఆయనపై ఎందుకు విచారణ జరిపించడం లేదు?’ అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి నాలుగేళ్లపాటు బీజేపీకి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కనిపించలేదా? అని అడిగారు. బాబు అవినీతిలో బీజేపీకి, పవన్ కు భాగస్వామ్యం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని అన్నారు.నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిల గురించి ఏమాత్రం విచారణ జరిపించడం లేదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మద్యం అమ్మకాలపై మహిళలు త్వరలోనే అసమ్మతి భేరి మోగిస్తారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *