సన్నీ లియోన్ బాధ విన్నారా…

0

sunnyleone2_apduniaమళ్లీ సన్నీలియోన్‌ పేరు మార్మోగిపోతుంది. కారణం- షారుక్‌ ఖాన్‌ రయీస్‌ మూవీలో సన్నీలియోన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేస్తుండటమే. లైలా మే లైలా అంటూ సన్నీ చిందులు వేసింది. ఆ పాటకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్‌ చేయగానే యాజ్‌ యూజువల్‌ గా సన్నీలియోన్‌ జపం మొదలైంది. అయితే తనకి ఇంత పాపులార్టీ.. స్టార్‌ డమ్‌ ఊరకే వచ్చేయలేదని.. తన జర్నీ అందరూ ఊహించినంత ఈజీగా సాగలేదని.. ఇక్కడి దాకా రావడానికి చాలా కష్టాలే పడ్డానని చెప్పుకొచ్చింది. సన్నీలియోన్‌ అంటే అందరికి పోర్న స్టార్‌గానే పరిచయం. అంతా చూపించి డబ్బులు సంపాదించే సన్నీ కూడా ఇలాంటి మాటలు చెబితే వినడానికి ఏదోలా ఉంటుందనే కామెంట్స్ వినిపించినా.. సన్నీ మాత్రం డోంట్‌ కేర్‌ అంటోంది. తెలిసీ తెలియకుండా పోర్న్ ఉచ్చులో ఇరుక్కొన్నా.. దానివల్ల అయిన వాళ్లందరికీ దూరమయ్యాని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కానీ ఎవ్వరినీ బాధ పెట్టకుండా నా అంతట నేను ఎదిగా అంటూ చాలా విషయాలే చెప్పింది. ఎలాంటి కష్టంలో అయినా తనను సపోర్ట్ చేసే భర్త దొరకడం అదృష్టమని మురిసిపోతుంది కూడా.ఇవేవీ అర్థం చేసుకోకుండా రేటింగ్స్ కోసం.. సేల్స్ కోసం తన మీద ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంటున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. పనిలో పనిగా తన కష్టాన్ని గుర్తించి మంచి ఆఫర్‌ ఇచ్చిన షారుక్‌కి స్పెషల్‌ థ్యాంక్స్ చెప్పింది. ఇక బీబీసీ చేసిన సర్వేలో మోస్ట్ ఇన్‌ ఫ్లూయెంట్‌ ఉమెన్‌ జాబితాలో సన్నీలియోన్‌ పేరు కూడా ఉంది. ఇలాంటి సర్వేల లెక్కలు- ప్రమాణాలు తనకి తెలియవని కాకపోతే ప్రముఖ వ్యక్తుల సరసన తన పేరు కూడా నిలవడం మాత్రం ఆనందంగా ఉందంది.

Share.

Comments are closed.