ఆమ్లేట్ వేయలేదని ఆత్మహత్య

0

చిన్న చిన్న కారణాలకే జనం ప్రాణాలు తీసుకుంటున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని పిల్లలు.. చిన్న గొడవలేక పెద్దలు ఆత్మహత్యల్ని చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాగొచ్చిన భర్త .. భార్య అడిగితే ఆమ్లేట్ వేయలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేబీహెచ్‌బీకాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేవడ మహేశ్, వనజ భార్యభర్తలు. కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1లో నివసిస్తున్నారు. మహేష్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఫుల్‌గా తాగి ఇంటికొచ్చాడు. భార్యను ఆమ్లేట్ వేయాలని అడిగాడు. దీంతో వనజ వేయనని చెప్పింది. మద్యం మత్తులో వనజతో గొడవకు దిగాడు. దీంతో వనజ యజమాని ఇంటికి వెళ్లి గొడవ జరిగిందని చెప్పింది. చాలాసేపటి వరకు యజమాని ఇంటి దగ్గరే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్లింది. తలుపు వేసి ఉండటంతో… తలుపు తీయాలని భర్తను కోరింది. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. దీంతో లోపల మహేష్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేశారు.

Share.

About Author

Leave A Reply