సుధాముర్తి వందనమమ్మ

ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తికి అందరూ సెల్యూట్ చెబుతున్నారు. ఎందుకంటే.. ఆ అమ్మ చేస్తున్న మంచిపనికి. కేరళ, కొడ్‌గావ్(కర్ణాటక) వరద బాధితులకు సహాయం చేసేందుకు స్వయంగా సుధా మూర్తి ముందుకు వచ్చారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నేతృత్వంలో కేరళ, కొడ్‌గావ్ వరద బాధితులకు దుస్తులు, ఇతర వస్తువులు సహాయం చేసేందుకు ప్యాకింగ్ చేయిస్తున్నారు సుధామూర్తి. అయితే ఆమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి కాబట్టి.. చైర్‌లో కూర్చొని పని చేయించుకోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. దుస్తులను, వస్తువులను ప్యాకింగ్ చేశారు సుధా మూర్తి. అక్కడున్న కవర్లను ఏరివేస్తూ.. పనివారితో కలిసి తాను ఇన్ఫోసిన్ చైర్‌పర్సన్ అన్న విషయాన్ని మరిచిపోయి.. సుధా మూర్తి మానవతావాదిగా నిలిచారు. సుధా మూర్తి పని చేసిన వీడియోను బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి సదానందగౌడతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. సుధా మూర్తి చేసిన గొప్ప పనికి ఆమెను పలువురు అభినందించారు. సెల్యూట్ చేస్తున్నారు. మీరు మా అందరికీ ఆదర్శమని కొనియాడుతున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com