కొనసాగుతున్న సీబీఐటీ విద్యార్ధుల అందోళన

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం సిబిఐటి కాలేజీలో విద్యార్థుల ఆందోళన నాలుగో రోజుకు చేరింది. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తరగతులను, పరీక్షలను విద్యార్ధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు గా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సిబిఐటి కాలేజీ వద్దకు చేరుకుని తమ మద్దతు తెలిపారు. కాలేజీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కవరేజీకి వెళ్లిన మీడియాను కాలేజీ యాజమాన్యం, పోలీసులు కాలేజీ లోపలికి అనుమతించలేదు. గతంలో ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగటంతో ఏ కేటగిరీకి చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజులను తగ్గించారంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు బి కేటగిరీ విద్యార్థులకు కూడా ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com