జానీవాకర్ నర్తకి జాగ్రత్త ….

మహానాడు వేదిక మీద నుంచి జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌ను వాడు వీడు అంటూ జేసీ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు.

నేరుగా లిక్కర్ షాపు నుంచి మహానాడుకు వచ్చి జేసీ మాట్లాడినట్టుగా ఉందన్నారు. జానీవాకర్ జేసీ.. ఒక రాజ నర్తకిలా తయారయ్యారని వ్యాఖ్యానించారు. పూర్వం రాజులను ఆనందపెట్టేందుకు నర్తకిలు నాట్యమాడేవారని.. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.

చంద్రబాబు వద్ద మెప్పుకోసం జేసీ నాట్యమాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రులుగా ఎవరున్నా వారి వద్ద భజన చేయడం జేసీకి అలవాటేనన్నారు. ఒకప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం పోటీ చేయలేక జిల్లా వదిలి పారిపోయిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని విమర్శించారు.

అలాంటి జేసీకి వైఎస్‌ కుటుంబాన్ని విమర్శించే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. నాయకులను చంద్రబాబు ఏవిధంగా వాడుకుని వదిలేస్తారో​…. నాగం జనార్ధన్‌ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహుల ఉదంతాలే నిదర్శనమన్నారు. త్వరలోనే ఆ జాబితాలోకి జేసీ దివాకర్ రెడ్డి, సోదిరెడ్డి చేరుతారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *