శ్రీరెడ్డి…. ధర్టీ ఇయర్‌ ఇండస్ట్రిపై గురి

కాస్టింగ్ కౌచ్‌పై గత కొంతకాలంగా పోరాడుతున్న శ్రీరెడ్డి.. తాజాగా కమెడియన్ పృధ్వీ‌‌రాజ్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్వూలో కాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడిన పృధ్వీ.. వారికి ఇష్టమయ్యే కదా..? వెళ్లారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ.. అప్పుడేమో సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు అని శ్రీరెడ్డిని ఉద్దేశించి పృధ్వీ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పృధ్వీ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ‘కామెడీ పృధ్వీ.. నీ గోకుడు యవ్వారాలు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లో తెలీవా..? లేక.. అమెరికా ఈవెంట్స్‌కి వెళ్లిన అమ్మాయిలకు తెలీవా..? ఎమ్మెల్యే టికెట్ కావాలంట..!’ అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా టాలీవుడ్‌లో సుపరిచితమైన పృధ్వీ‌ తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 2 గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జనాల్ని పిచ్చోల్ని చేయడానికి ఆ షో నడుపుతున్నారని.. తాను అక్కడికి వెళ్తే.. అందర్నీ కడిగిపారేస్తానంటూ దుయ్యబట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com