పీవీఆర్ చేతికి ఎస్‌పీఐ సినిమాస్‌

ద‌క్షిణాదిలో ప్ర‌ముఖ సినిమా ఎగ్జిబిట‌ర్ అయిన ఎస్‌పీఐ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పీవీఆర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 850 కోట్లు. ఇందులో కొంత మొత్తం న‌గ‌దు రూపంలో,మ‌రికొంత షేర్ల రూపంలో చెల్లిస్తారు. త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌తోపాటు ముంబైలో ఎస్‌పీఐ సినిమాస్‌కు థియేట‌ర్లు ఉన్నాయి. డీల్‌లో భాగంగా ఎస్‌పీఐ సినిమాస్‌లో 71.7 శాతానికి స‌మాన‌మైన 2,22,711 షేర్ల‌ను ఒక్కోటి రూ. 1317 చొప్పున పీవీఆర్ కొనుగోలు చేస్తుంది. దీని విలువ రూ. 633 కోట్లు. కొత్త‌గా పీవీఆర్ లిమిటెడ్‌కు చెందిన 16 ల‌క్ష‌ల షేర్ల‌ను జారీ చేసి ఎస్‌పీఐ సినిమాస్‌కు ఇస్తుంది. సినిమా ప్రియుల అనుభ‌వాన్ని స‌త్యం సినిమాస్ స‌రికొత్త‌గా మార్చేసింది. దాదాపుగా రెండు ద‌శాబ్దాలుగా చెన్నై కేంద్రంగా ఈ సంస్థ ప‌నిచేస్తోంది.డీల్ త‌ర్వాత‌ పీవీఆర్ లిమిటెడ్ వాటా 3.3శాతం పెరుగుతుంది. ఇలా జారీ చేసిన షేర్ల విలువ రూ. 210 కోట్లు. క్యాష్ రూపంలో రూ. 633, షేర్ల రూపంలో 210 కోట్లు చెల్లిస్తున్నార‌న్న‌మాట‌. ఈ డీల్‌తో ప్ర‌పంచంలోనే 7వ అతి పెద్ద సినిమా ఎగ్జిబిట‌ర్‌గా పీవీఆర్ లిమిటెడ్ మారుతుంది.ఈ డీల్ త‌ర‌వాత కూడా ఎస్‌పీఐ సినిమాస్‌కు చెందిన కిర‌ణ్ ఎం రెడ్డి, స్వ‌రూప్ రెడ్డీలు ఇదే వ్యాపారాన్నికొన‌సాగిస్తారు. ఎస్‌పీఐ సినిమాస్‌కు ప‌ది న‌గ‌రాల్లో 17 ఆస్తుల‌తో పాటు 76 స్ర్ర్కీన్స్ ఉన్నాయి. వీటిలో ఇప్ప‌టికే 68 న‌డుస్తుండ‌గా, మ‌రో 8 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మ‌రో 100 స్క్రీన్స్ ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది. ఎస్‌పీఐ సినిమాస్‌కు ఉన్న ప్ర‌ధాన ఆస్తి చెన్నైలోని స‌త్యం సినిమాస్‌. ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేస్తున్న పీవీఆర్ వినోద రంగంలో అతిపెద్ద సంస్థ‌. సినిమా ప్ర‌ద‌ర్శ‌న వ్యాపారంలో గ‌త కొన్నేళ్లుగా మంచి స్థానంలో ఉంది. చిత్ర పంపిణీ వ్యాపారంలోనూ పీవీఆర్ విశిష్ట సేవ‌ల‌నందిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com