కసాయి కొడుకు…

అప్పులు చేసి పరువు తీస్తోందని నవమాసాలు మోసి, కనీ పెంచిన కన్నతల్లినే పొట్టనపెట్టుకున్నాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణం హైదరాబాద్‌ నగరంలోని ఎస్సార్‌‌నగర్‌ ఎల్లారెడ్డిగూడలో బుధవారం (జూన్ 28) రాత్రి జరిగింది. అప్పులు చేస్తోందని తల్లి మమతను కొడుకు మదన్ (22) చంపేశాడు. మొదట మమతను కర్రతో కొట్టిన మదన్.. అంతటితో ఆగకుండా ఆమె గుండెలపై కూర్చుని గొంతునులిమి ఊపిరి ఆగేలా చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎస్సార్‌నగర్ ఎల్లారెడ్డిగూడ కేబీఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో నివసించే శ్రీనివాస్, మమత దంపతులకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ ఇంటి అద్దెలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు. ఆర్థిక అవసరాలరీత్యా మమత చిట్టీల వ్యాపారం చేసేది. అయితే అందులో నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చిట్టీ సొమ్ముల కోసం బాధితులు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఇటీవ ఒకసారి ఎన్టీఆర్ గార్డెన్స్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది మమత.

కుటుంబం అప్పుల పాలు కావడానికి తల్లే కారణమంటూ మమత కొడుకు మదన్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో రెండు వారాల క్రితం ఇళ్లు వదిలి ఎవ్వరికీ చెప్పకుండా ఆమె అన్న రమేష్ ఇంటికి వెళ్లింది. అయితే రాత్రి మమతను, రమేష్ ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోగా.. ఉదయం అయ్యే సరికి ఆమె విగతజీవిలా మిగిలింది. కాగా మమత హత్య కేసులో భర్త శ్రీనివాస్ ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన కూతురును కొట్టి చంపిన వారిలో అల్లుడు శ్రీనివాస్ కూడా ఉన్నాడని మమత తండ్రి రాములు యాదవ్ ఆరోపించాడు. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com