కేరళలో ఇళ్లలోకి చేరుతున్న పాములు, మొసళ్లు

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. ఇళ్లల్లోకి చేరిన నీరు కూడా క్రమేనా వెనక్కి తగ్గుతోంది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. అయితే, కొందరు బాధితులకు షాకింగ్ అనుభవాలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చేరిన పాములు, మొసళ్లు తదితర విషపూరిత జీవులను చూసి భయాందోళనలకు గురవుతున్నారు. త్రిసూర్ జిల్లాలోని చలకుడీలో సోమవారం రాత్రి తన ఇంట్లో వరద తగ్గిందో లేదో చూసేందుకు వెళ్లిన ఓ బాధితుడు.. ఇంట్లో మొసలిని చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే చుట్టుపక్కవారిని పిలిచి, దాన్ని తాళ్లతో బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో పాములు బయటపడుతున్నాయి. మలప్పురానికి చెందిన ముస్తాఫా అనే పాములు పట్టే వ్యక్తి.. గత రెండు రోజుల్లో 100 పాములను పట్టుకున్నానని తెలిపాడు. వరద తగ్గడంతో ఇళ్లను శుభ్రం చేసుకుందామని వస్తున్న బాధితులు.. పాములను చూసి బయటకు పరుగు పెడుతున్నారు. ఎర్నాకులంలో ఇప్పటి వరకు దాదాపు 52 మంది పాము కాటుకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం.. వరద బాధిత ప్రాంతాల్లో పాము కాటు విరుగుడు మందులను అందుబాటులోకి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com