ముందుకు సాగని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

ప్రతి కుటుంబానికి సొంతిటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ప్రారంభించింది..పేద, మధ్య తరగతి, ప్రభుత్వ, ప్రైయివేటు ఉద్యోగం అనేదీ తేడా లేకుండా స్తోమతను బట్టీ ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించారు. పట్టణాల్లో భారీగా దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తుల విషయం అటకెక్కడంతో అందరికీ ఇళ్లు అనే విషయంలో అయోమయం నెలకొంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు నగరాలు, పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకోవడం భారంగా మారింది. దీంతో కేంద్రం 2022నాటికి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గతేడాది ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద డివిజన్లు, వార్డుల వారీగా అందరికీ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు స్వీకరించారు.ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో దరఖాస్తులు తీసుకున్నారు. వీవీఎన్‌ కన్సల్టెన్సీతో పాటు పలు సంస్థలు ఈ దరఖాస్తులన్నింటీని సేకరించి కేంద్రానికి ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. ఇందులో అర్హులను గుర్తించడానికి సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో ఎలాంటి విషయాలు తెలియకపోవడంతో ఆ దరఖాస్తుదారులు అయోమయానికి గురి అవుతున్నారు.అందరికీ ఇళ్ల పథకంలో పేదలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి స్థోమత లేని వారు, అదనంగా అంతస్తుల నిర్మాణం చేసుకోవడానికి వీలు కల్పించారు. దీంతో ఆయా పట్టణాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు అందించారు. దరఖాస్తులను తీసుకోవడానికి డివిజన్లు, వార్డుల వారీగా కౌంటర్లు పెట్టి మరి తీసుకున్నారు.ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో ప్రతి ఒక్కరూ దరఖాస్తులు అందజేశారు. ఇంటి స్థలం ఉన్న వారు రుణాల కోసం, అసలే ఇల్లు లేని వారు ఎప్పుడూ ఇంటిని మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల విషయంలో అర్హులు అధికంగా ఉండటం, అసలే ఇల్లులేని వారు, మురికివాడల్లో నివసిస్తున్న వారికే అవకాశం ఉంటుందని పేర్కొంటుండటంతో మొత్తమే ఇల్లు లేక అద్దె భవనాల్లో ఉంటున్న వారికి పీఎంఏవై పథకం ఊరటగా ఉన్న లబ్దిదారుల ఎంపిక విషయంలో మాత్రం తీవ్రమైన జాప్యం నెలకొంటుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి పీఎంఏవై పథకం అమలు విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై…నగరపాలకలోని ఓ అధికారి దృష్టికి తీసుకేళ్లగా దరఖాస్తులన్నింటీనీ కేంద్రానికి ఆన్‌లైన్‌ చేసి పంపించారన్నారు. దీనిపై స్పష్టత కన్సల్టెన్సీకే తెలుస్తోందని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *