బుల్లితెరపై హోస్ట్ గా ఎంట్రీ

0

క్రేజీ హీరోయిన్ గా సౌత్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు. సడన్ గా సినిమాలు మానేసింది. పవన్ సరసన కాటమరాయుడు తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా రాక్ స్టార్ గా మ్యూజిక్ లో ఇమేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ అమ్మడు బుల్లితెరపై హోస్ట్ గా ఎంట్రీ ఇస్తుందట. హీరోయిన్ గా మంచి అవకాశాలను వదిలిపెట్టి ఎందుకు టివి షో చేస్తుందో అర్థం కాక ఆమె ఫాన్స్ అయోమయంలో పడ్డారు. తమిళంలో హలొ సాగో పేరిట రూపొందే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తుందట. ఈ కార్యక్రమం ద్వారా పలువురు సినిమా ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేస్తుందట. ఈ షో ఈ నెల 28నుండి ప్రారంభం కానుంది. మరి టివి రంగంలో ఈ అమ్మడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Share.

About Author

Leave A Reply